Zindagi9News కథనానికి వెంటనే స్పందన.. జమ్మికుంట ఫ్లైఓవర్ గుంతలకు తాత్కాలిక మరమ్మతులు

జమ్మికుంట, జూలై 8 (Zindagi9news): జమ్మికుంట ఫ్లైఓవర్‌పై ఏర్పడిన భారీ గుంతల కారణంగా వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై Zindagi9News ప్రచురించిన కథనానికి అధికారులు వెంటనే స్పందించారు. గుంతలను గుర్తించి అత్యవసరంగా తాత్కాలిక మరమ్మతులు చేపట్టి పూడ్చివేశారు. దీంతో ప్రమాదాల ముప్పు కొంత మేర తగ్గి వాహనదారులకు ఉపశమనం లభించింది.ఇటీవల వర్షాల కారణంగా ఫ్లైఓవర్‌పై రహదారి దెబ్బతిని భారీ గుంతలు ఏర్పడగా, Zindagi9News ఈ సమస్యను వెలుగులోకి తీసుకొచ్చింది. కథనం ప్రచురితమైన వెంటనే సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. అయితే వర్షాకాలం ముగిసిన తర్వాత ఫ్లైఓవర్‌పై శాశ్వత రహదారి పునరుద్ధరణ పనులు చేపట్టి ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
