తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వ సలహాదారు కేశవరావు ఫలితాలను ప్రకటించారు. జనరల్ మరియు ఒకేషనల్ కలిపి మొత్తం ఉత్తీర్ణత శాతం 70.58గా నమోదైంది.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు మొత్తం 4,89,123 మంది విద్యార్థులు హాజరుకాగా, అందులో 3,23,807 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫస్ట్ ఇయర్ ఉత్తీర్ణత శాతం 66.02గా ఉంది. బాలికల ఉత్తీర్ణత 74.4 శాతం కాగా, బాలుర ఉత్తీర్ణత 57.69 శాతంగా నమోదైంది.
సెకండ్ ఇయర్ పరీక్షలకు 5,07,948 మంది విద్యార్థులు హాజరుకాగా, అందులో 3,58,490 మంది ఉత్తీర్ణులయ్యారు. సెకండ్ ఇయర్ ఉత్తీర్ణత శాతం 70.58గా నమోదైంది. బాలికల ఉత్తీర్ణత 78.65 శాతం ఉండగా, బాలుర ఉత్తీర్ణత 62.5 శాతంగా ఉంది.
ఈసారి కూడా బాలికలు అన్ని విభాగాల్లో బాలుర కంటే మెరుగైన ఫలితాలు సాధించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
