TGPSC Recruitment: 544 ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ రద్దు.. కొత్త నోటిఫికేషన్‌పై ప్రకటన

హైదరాబాద్, సెప్టెంబర్ 13: తెలంగాణలోని ప్రభుత్వ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు (లెక్చరర్లు), ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ల నియామకానికి సంబంధించి టీజీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. 2022 డిసెంబర్ 31న జారీ చేసిన 544 పోస్టుల Brief Notification No.33/2022ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
వివిధ అంశాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీజీపీఎస్సీ వెల్లడించింది. పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసి, కొత్త నోటిఫికేషన్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలిపింది.
పాత నోటిఫికేషన్‌కు సంబంధించిన అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని కమిషన్ సూచించింది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
