
తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల: జూన్ 5 నుంచి పరీక్షలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాల విడుదల అనంతరం, ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం విద్యాశాఖ ‘అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ’ పరీక్షల టైమ్ టేబుల్‌ను ప్రకటించింది. ప్రభుత్వ పరీక్షల విభాగం వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం, ఈ పరీక్షలు జూన్ 5 నుండి జూన్ 12 వరకు జరగనున్నాయి.
పరీక్షల పూర్తి వివరాలు:
పరీక్ష సమయం: ప్రతిరోజూ ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు (సైన్స్ పరీక్షలకు మాత్రం ఉదయం 11:00 గంటల వరకే సమయం ఉంటుంది).
ముఖ్యమైన తేదీలు:
జూన్ 5 (శుక్రవారం): ఫస్ట్ లాంగ్వేజ్ (గ్రూప్-A), కాంపోజిట్ కోర్సు.
జూన్ 6 (శనివారం): సెకండ్ లాంగ్వేజ్.
జూన్ 7 (ఆదివారం): థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్).
జూన్ 8 (సోమవారం): గణితం (Mathematics).
జూన్ 9 (మంగళవారం): ఫిజికల్ సైన్స్ (Part-I).
జూన్ 10 (బుధవారం): బయోలాజికల్ సైన్స్ (Part-II).
జూన్ 11 (గురువారం): సోషల్ స్టడీస్ / OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్-I.
జూన్ 12 (శుక్రవారం): OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్-II.
ముఖ్య గమనికలు:
పార్ట్-బి (ఆబ్జెక్టివ్): ఇంగ్లీష్, సైన్స్ మినహా మిగిలిన అన్ని సబ్జెక్టులకు చివరి 30 నిమిషాల్లో సమాధానాలు రాయాలి. ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్‌కు చివరి 15 నిమిషాలు కేటాయించారు.
అర్హత: మార్చి 2026 పరీక్షల్లో తప్పిన వారితో పాటు, గతంలో (2015 నుండి) ఫెయిల్ అయిన అభ్యర్థులు కూడా ఈ పరీక్షలకు హాజరుకావచ్చు.
ఫీజు గడువు: పరీక్ష ఫీజు చెల్లించడానికి మే 14 చివరి తేదీగా నిర్ణయించారు. ఒకవేళ గడువు ముగిస్తే, రూ. 50 ఆలస్య రుసుముతో పరీక్షకు రెండు రోజుల ముందు వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంది.
విద్యార్థులు రీ-కౌంటింగ్ లేదా రీ-వెరిఫికేషన్ ఫలితాల కోసం వేచి చూడకుండా, వెంటనే సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
