స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (CHSL) 2024 పరీక్షల తుది ఫలితాలను ఫిబ్రవరి 18, 2025న విడుదల చేసింది. మొత్తం 3,712 ఖాళీలకు గాను, 3,421 అభ్యర్థులు ఎంపికయ్యారు. ఫలితాలను SSC అధికారిక వెబ్సైట్ http://ssc.gov.in లో చూడవచ్చు.
2024 ఏప్రిల్ 8న విడుదలైన ఈ నోటిఫికేషన్‌కు, మే 7 వరకు దరఖాస్తులు స్వీకరించారు. జులై 1 నుండి 11 వరకు టైర్-1 పరీక్షలు నిర్వహించగా, నవంబర్ 18న టైర్-2 పరీక్ష జరిగింది. తాజాగా విడుదలైన ఫలితాలతో పాటు, కేటగిరీ వారీగా కటాఫ్ మార్కులను కూడా ప్రకటించారు.
ఎంపికైన అభ్యర్థుల పూర్తి మార్కుల వివరాలను డిసెంబర్ 14న వెబ్సైట్లో అప్లోడ్ చేయనున్నట్లు SSC తెలిపింది. అభ్యర్థులు తమ రోల్ నంబర్ మరియు ఇతర వివరాలతో ఫలితాలను వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు.
