సిరిసిల్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు

సిరిసిల్ల, సెప్టెంబర్ 5( Zindagi9news): రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విద్యార్థులతో వెళ్తున్న ప్రైవేట్ స్కూల్ బస్సును మరో ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలైనట్లు సమాచారం.
పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. విద్యార్థులను తీసుకెళ్తున్న స్కూల్ బస్సును అప్పారెల్ పార్కుకు చెందిన ప్రైవేట్ బస్సు ఢీకొట్టినట్లు సమాచారం. ప్రమాద ధాటికి స్కూల్ బస్సు కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. గాజు ముక్కలు తగలడంతో కొందరు విద్యార్థులకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది.
ప్రమాదంతో బస్సులోని విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
ప్రమాదానికి కారణం అతివేగమా, డ్రైవర్ నిర్లక్ష్యమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
