బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యునిగా రాజేష్ ఠాకూర్ నియామకం

జమ్మికుంట, మే 23 (Zindagi9News): భారతీయ జనతా పార్టీ (BJP) తెలంగాణ రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యుడిగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణానికి చెందిన రాజేష్ ఠాకూర్ నియమితులయ్యారు.
ఈ సందర్భంగా రాజేష్ ఠాకూర్ పార్టీ రాష్ట్ర, జిల్లా అగ్రనాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో ఈ కీలక బాధ్యతను అప్పగించినందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్, రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు క్రాంతి కిరణ్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా రాజేష్ ఠాకూర్ మాట్లాడుతూ, పార్టీ అగ్రనాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ బలోపేతానికి, ఎస్సీ సామాజిక వర్గ సంక్షేమానికి శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ పార్టీ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని పేర్కొన్నారు.
అలాగే, తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ రాజేష్ ఠాకూర్ కృతజ్ఞతలు తెలియజేశారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
