మైనర్లకు సిగరెట్ల విక్రయం.. పాన్‌షాప్ యజమాని, ఉద్యోగి అరెస్ట్

హైదరాబాద్, ఆగస్టు 30: మైనర్లకు సిగరెట్లు విక్రయిస్తున్న పాన్‌షాప్‌పై ఈగల్ ఫోర్స్ అధికారులు దాడి చేసి యజమాని సహా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన పాత బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పాన్‌షాప్‌లో మైనర్లకు సిగరెట్లు విక్రయిస్తున్నారనే సమాచారంతో దుకాణంపై నిఘా పెట్టారు. పలుమార్లు పరిశీలించిన అనంతరం మైనర్లు సిగరెట్లు కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో పాన్‌షాప్‌పై దాడి చేసి యజమాని మొహమ్మద్ యూసుఫుద్దీన్ గౌరీ, ఉద్యోగి రెహాన్ అలీ (19)ను అదుపులోకి తీసుకున్నారు.
దుకాణంలో తనిఖీలు నిర్వహించగా వివిధ బ్రాండ్ల సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు కలిపి సుమారు రూ.60 వేల విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మైనర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఘటనపై తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
