
రైలు నుంచి పడి కూలీ కార్మికుడి మృతి
జమ్మికుంట, మే 4 (జిందగీ 9 న్యూస్) : ఖమ్మం జిల్లా చింతకాని గ్రామానికి చెందిన దేవళ్ళ రాజేష్ (33) రైలు ప్రమాదంలో మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. రాజేష్ గత రెండేళ్లుగా వరంగల్‌లో నివసిస్తూ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
పోలీసుల వివరాల ప్రకారం, రాజేష్ రైలులో ప్రయాణిస్తున్న సమయంలో బిజిగిరి షరీఫ్ రైల్వే స్టేషన్ సమీపంలో అనుకోకుండా రైలు నుంచి కిందపడినట్లు సమాచారం. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
మృతుడి వద్ద లభించిన మొబైల్ ఫోన్ ఆధారంగా అతని అన్న దేవళ్ళ సతీష్‌కు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాన్ని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మార్చురీలో భద్రపరిచారు. సతీష్ అక్కడికి చేరుకుని మృతదేహాన్ని గుర్తించారు.
పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించగా, అంత్యక్రియల కోసం స్వగ్రామానికి తరలించారు. ఈ ఘటనపై ప్రభుత్వ రైల్వే పోలీస్ రామగుండం హెడ్ కానిస్టేబుల్ జి. తిరుపతి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
