కరీంనగర్లో పీఎంజే జ్యువెలరీ షాప్లో కాల్పుల కలకలం
నలుగురు దొంగల దాడి – కాల్పులు జరిపి భారీగా బంగారు ఆభరణాల దోపిడి

కరీంనగర్, మే 3(zindagi9news) : కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ షాప్లో ఆదివారం దొంగల దాడి కలకలం రేపింది. నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు షాపులోకి చొరబడి కాల్పులు జరిపి, భారీగా బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. ఈ ఘటనలో నలుగురు సిబ్బందికి గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దుండగుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
