
శాంతినికేతన్ పాఠశాలలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు
టేకుమట్ల, ఏప్రిల్ 21 (zindagi9news): భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని శాంతినికేతన్ హై స్కూల్లో మంగళవారం గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ మియాపురం హరీష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రాంగణాన్ని ఆకర్షణీయంగా అలంకరించారు.
గ్రాడ్యుయేషన్ గౌన్లు ధరించిన చిన్నారులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో హాజరైన వారిని ఆకట్టుకున్నారు. ముఖ్య అతిథులుగా టేకుమట్ల ఎస్సై అమూల్య, సర్పంచ్ గునిగంటి రజిని మహేందర్ హాజరై మాట్లాడుతూ, చిన్న తరగతుల నుంచే గ్రాడ్యుయేషన్ వేడుకలు నిర్వహించడం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని తెలిపారు.
విద్యార్థుల ప్రతిభను, నృత్య ప్రదర్శనలను వారు అభినందించారు. అనంతరం చిన్నారులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
