వైరా పట్టణ రజక సంఘం యువజన కమిటీ ఎన్నిక
రజక యువత ఐక్యతకు నూతన కమిటీ ఏర్పాటు

ఖమ్మం జిల్లా, సెప్టెంబర్ 14 (Zindagi9news): వైరా పట్టణ రజక సంఘం యువజన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వైరా పట్టణ రజక సంఘం అధ్యక్షుడు ఏదునూరి శ్రీను అధ్యక్షతన జరిగిన సమావేశంలో నూతన కమిటీని ఏర్పాటు చేశారు.రజక యువతను ఐక్యంగా ముందుకు తీసుకెళ్లడంతో పాటు, యువత ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనే లక్ష్యంతో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా వైరా పట్టణ రజక సంఘం యువజన అధ్యక్షుడిగా ఏదునూరి శ్రీను (బుజ్జి) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా మంకెన ఉపేందర్ ఎన్నికయ్యారు.నూతన కమిటీ సభ్యులు: ఏదునూరి అప్పారావు, రేమల్ల రాము, వడ్లమాని కోటేశ్వరరావు, రాచకొండ సాయి, అనుమోలు సైదులు, ఏదునూరి రాము, జంపన్న, వల్లంకొండ సైదులు.నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ రజక యువతను సమన్వయం చేసుకుంటూ సంఘం అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేస్తామని తెలిపారు. యువత ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.అలాగే సామాజిక సేవా కార్యక్రమాల్లో యువతను భాగస్వామ్యం చేస్తూ రజక సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.నూతన యువజన కమిటీకి పలువురు రజక సంఘం నాయకులు, యువత శుభాకాంక్షలు తెలిపారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
