బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్.. తక్షణ విచారణకు ఆదేశం
హైదరాబాద్: పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన కేసుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. కేసుపై తక్షణమే విచారణ ప్రారంభించాలని రాష్ట్ర డీజీపీ C. V. ఆనంద్ ను ఆదేశించినట్లు సమాచారం.
ఈ సందర్భంగా, ఈ నెల 8వ తేదీన ఫిర్యాదు అందినప్పటికీ ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ముఖ్యమంత్రి డీజీపీని ప్రశ్నించినట్లు తెలిసింది. అనంతరం కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను డీజీపీ సీవీ ఆనంద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించినట్లు సమాచారం.
అయితే, కేసు విచారణకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
