1000 రోజుల కాంగ్రెస్ పాలనపై హుజూరాబాద్‌లో బీఆర్ఎస్ భారీ నిరసన
‘420 హామీలు – 420 ఫిట్లు’ ఫ్లెక్సీతో ఆందోళన.. ‘కాంగ్రెస్ బాకీ కార్డు’తో ప్రచారం

హుజూరాబాద్, సెప్టెంబర్ 2: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తైన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బుధవారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 3,000 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంగా ‘420 హామీలు – 420 ఫిట్లు’ అనే భారీ ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అనంతరం ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ను ప్రజలకు పంపిణీ చేస్తూ అమలు కాలేదని పేర్కొంటున్న హామీలపై ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు దేవుడి సాక్షిగా ప్రమాణాలు చేసి ప్రజలకు గ్యారెంటీ కార్డులు అందజేశారని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి, దాదాపు వెయ్యి రోజులు గడిచినా హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. ‘వచ్చే నెల.. 100 రోజులు’ అంటూ ప్రజలను నమ్మించి ఇప్పుడు మాట తప్పారని ఆరోపించారు.
మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, తులం బంగారం, విద్యార్థినులకు ఉచిత స్కూటీలు, రైతులకు రైతు భరోసా, రూ.2 లక్షల రుణమాఫీ, వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెంచిన పింఛన్లు, నిరుద్యోగ భృతి, విద్యా భరోసా కార్డులు, రెండు లక్షల ఉద్యోగాల భర్తీ వంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఆయన ఆరోపించారు.
ప్రజలకు ప్రభుత్వం చెల్లించాల్సిన బాకీలను వెంటనే చెల్లించాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులను కాంగ్రెస్ ప్రభుత్వం నిరాశపరిచిందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసే వరకు బీఆర్ఎస్ ప్రజల పక్షాన రాజీలేని పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నియోజకవర్గవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బండ శ్రీనివాస్, వాల బాలకిషన్ రావు, పోల్నేని సత్యనారాయణ రావు, నైనేని తిరుపతిరావు, పింగిలి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
వీణవంక మండలం నుంచి ముసిపట్ల తిరుపతి రెడ్డి, నీల కుమారస్వామి, దాసరపు రాధాకృష్ణ, కాసర్ల సుధాకర్, జక్కు నారాయణ, ముత్యాల శంకర్, నాగిడి సంజీవ రెడ్డి, అడిగిప్పుల సత్యనారాయణ పాల్గొన్నారు.
ఇల్లందకుంట మండలం నుంచి సరిగొమ్ముల వెంకటేష్, కందాల కొమురెల్లి, మర్రి శ్రీనివాస్ రెడ్డి, దంసాని కుమార్, మోటపోతుల అలయ్య, కంది దిలీప్ రెడ్డి, తిప్పారవేని మొగిలి, మసూద్ అహ్మద్ (రఫీ), మట్టా వాసుదేవ రెడ్డి, కటంగూరి రాంస్వరన్ రెడ్డి, బూస అశోక్, తేడ్ల ఒదెలు పాల్గొన్నారు.
కమలాపూర్ మండలం నుంచి నైనేని తిరుపతి రావు, పేరాల సంపత్ రావు, యర్రం ఇంద్రసేన రెడ్డి, మరపెల్లి నవీన్ కుమార్, లండిగె లక్ష్మణ్ రావు, తక్కల్లపల్లి సత్యనారాయణ రావు, ఎమ్మడిశెట్టి శ్రీనివాస్, పెండ్యాల రవీందర్ రెడ్డి, పోరండ్ల కృష్ణ ప్రసాద్, ఎర్రబెల్లి సంపత్ రావు, కట్కూరి తిరుపతి రెడ్డి, మౌటం అశోక్, బాలసాని కుమారస్వామి, పోరండ్ల రమేష్, పుల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.
హుజూరాబాద్ మండలం నుంచి ఏడవెల్లి కొండల్ రెడ్డి, పోల్సాని రామారావు, సంగెం ఇలయ్య, ఎరుమల్ల సురేందర్ రెడ్డి, గుడూరి ప్రతాప్ రెడ్డి, తాటికొండ పుల్లాచారి, కట్కూరి మల్లారెడ్డి, మంతెన శ్రీనివాస్, పోరెడ్డి దయాకర్ రెడ్డి, దాసరి రమణారెడ్డి, అనుమండ్ల శ్యామ్‌సుందర్ రెడ్డి, బండి రమేష్, పాకాల లక్ష్మారెడ్డి, మండ సతీష్, పంజాల సదానందం, జైహింద్ రెడ్డి పాల్గొన్నారు.
జమ్మికుంట మండలం నుంచి దొడ్డె మమత, పోల్సాని మనోహర్ రావు, పోల్సాని తిరుపతి రావు, పమ్మిడి లింగారావు, మాదిరెడ్డి వెంకట్ రెడ్డి, కడవెరుగు మోహన్, పోల్సాని సమ్మారావు, కనపర్తి లింగారావు, మడికొండ సురేందర్ రావు, తోట లక్ష్మణ్, బి. సమ్మారావు, చిల్మల రామస్వామి, చందుపట్ల కృష్ణారెడ్డి, రాచపల్లి రాజయ్య పాల్గొన్నారు.
హుజూరాబాద్ మున్సిపాలిటీ నుంచి గందే శ్రీనివాస్, వర్దినేని రవీందర్ రావు, కొలిపాక శ్రీనివాస్, ప్రతాప తిరుమల్ రెడ్డి, పోరెడ్డి శాంతన్ రెడ్డి, కేసిరెడ్డి లావణ్య నరసింహ రెడ్డి, అపరాజ ముత్యం రాజు, తల్లపల్లి శ్రీనివాస్, ముక్క రమేష్, ములుగు పూర్ణచందర్, ఆర్.కే. రమేష్, బాబా షఫియొద్దీన్ (ఇమ్రాన్), సమ్మారావు బోర్నపల్లి, మెరుగు కొండల్ రెడ్డి, ఎం.డి. అంజదుల్లా ఖాన్ పాల్గొన్నారు.
జమ్మికుంట మున్సిపాలిటీ నుంచి ములుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్), తక్కల్లపల్లి రాజేశ్వర్ రావు, ఎం.డి. ముంతాజ్ అలీ (జావేద్), పొదేటి రామస్వామి, పొనగంటి సంపత్, బచ్చు శివశంకర్, పొనగంటి మల్లయ్య, పొనగంటి రాము, బొడ్డుల రవీందర్, జుగురు సదానందం, దయ్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
