జమ్మికుంట–పోత్కపల్లి మధ్య సిగ్నలింగ్ పనులు.. పలు రైళ్ల రద్దు, పాక్షిక రద్దు

జమ్మికుంట: కాజీపేట–బల్హార్షా సెక్షన్లోని జమ్మికుంట–పోత్కపల్లి రైల్వే స్టేషన్ల మధ్య ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడానికి నాన్-ఇంటర్లాకింగ్ పనులు చేపడుతున్నారు. ఈ పనుల కారణంగా సెప్టెంబర్ 9, 10 తేదీల్లో పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు, మరికొన్ని రైళ్లను రీషెడ్యూల్, నియంత్రించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
పూర్తిగా రద్దయ్యే రైళ్లు
సెప్టెంబర్ 10న
- 17003 కాజీపేట–సిర్పూర్ టౌన్
- 17004 బల్హార్షా–కాజీపేట
ఈ రెండు రైళ్లు పూర్తిగా రద్దు కానున్నాయి.
పాక్షికంగా రద్దయ్యే రైళ్లు
సెప్టెంబర్ 10న
- 17033 భద్రాచలం–బల్హార్షా: వరంగల్–బల్హార్షా మధ్య పాక్షిక రద్దు
- 17034 సిర్పూర్ టౌన్–భద్రాచలం రోడ్: సిర్పూర్ టౌన్–వరంగల్ మధ్య పాక్షిక రద్దు
- 17011 హైదరాబాద్–సిర్పూర్ కాగజ్నగర్: కాజీపేట్–సిర్పూర్ కాగజ్నగర్ మధ్య పాక్షిక రద్దు
- 17012 సిర్పూర్ కాగజ్నగర్–బీదర్: సిర్పూర్ కాగజ్నగర్–కాజీపేట్ మధ్య పాక్షిక రద్దు
60 నిమిషాలు ఆలస్యంగా నడిచే రైళ్లు
సెప్టెంబర్ 10న
- 17233 సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్నగర్
- 67771 సిర్పూర్ టౌన్–కరీంనగర్
- 67773 కరీంనగర్–బోధన్
ఈ రైళ్లను 60 నిమిషాల పాటు రీషెడ్యూల్ చేయనున్నారు.
పలు రైళ్ల రాకపోకలపై ప్రభావం
సెప్టెంబర్ 9, 10 తేదీల్లో మరికొన్ని రైళ్లను మార్గమధ్యంలో నియంత్రించనున్నారు.
- 22365 దానాపూర్–SMVT బెంగళూరు: 75 నిమిషాలు
- 22366 SMVT బెంగళూరు–దానాపూర్: 45 నిమిషాలు
- 16031 చెన్నై సెంట్రల్–SMVD కత్రా: 30 నిమిషాలు
- 12622 న్యూఢిల్లీ–చెన్నై సెంట్రల్: 30 నిమిషాలు
ప్రయాణికులు ఈ మార్పులను గమనించి, ప్రయాణానికి ముందు రైలు సమయాలను పరిశీలించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
