ACB వలలో ADE – రూ.30 వేల లంచం తీసుకుంటూ పట్టుబాటు

దేవరకొండ, నల్లగొండ జిల్లా: తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు దేవరకొండలో దాడి నిర్వహించి అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ADE) సిరికొండ సైదులు ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అధికారిక పని చేయడానికి లంచం డిమాండ్ చేసి, స్వీకరిస్తుండగా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఫిర్యాదుదారుడు చేపట్టిన విద్యుత్ పనులకు సంబంధించిన రూ.10 లక్షల బిల్లును ప్రాసెస్ చేసి, పై అధికారులకు పంపించేందుకు సైదులు రూ.30,000 లంచం కోరినట్లు తెలిసింది. ఈ పనులు గతంలో తుఫాను కారణంగా దెబ్బతిన్న 33/11 కేవీ లైన్ పునరుద్ధరణకు సంబంధించినవి.
బాధితుడు ACBను ఆశ్రయించడంతో అధికారులు ఉచ్చు వేసి, లంచం తీసుకుంటున్న సమయంలో సైదులు ను పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న నగదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
