రామడుగు రామాలయం వద్ద రెండు బైక్లు ఢీ.. ఇద్దరికి స్వల్ప గాయాలు

నిజామాబాద్ రూరల్(సిరికొండ), అక్టోబర్ 20 (జిందగీ 9 న్యూస్): సిరికొండ మండలం రామడుగు గ్రామంలోని రామాలయం సమీపంలో మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో రెండు బైక్లు ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఒడ్డెర కాలనీకి చెందిన దండ్ల మనోహర్ రామడుగు నుంచి ఒడ్డెర కాలనీకి ఎలక్ట్రికల్ బైక్పై వెళ్తూ రోడ్డు దాటుతుండగా, కొండాపూర్ వైపు నుంచి భీమ్గల్కు వెళ్తున్న ఎల్లారెడ్డి మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన చేపూర్ పవన్ నడుపుతున్న హోండా షైన్ బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. అయితే, ఢీకొన్న తీవ్రతకు ఎలక్ట్రికల్ బైక్ పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ప్రాణాపాయం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
