
జమ్మికుంట: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వెనుక వైపు ఉన్న రహదారిలో బతుకమ్మ నిమజ్జనానికి వెళ్లిన మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బతుకమ్మ ఆడిన అనంతరం నిమజ్జనానికి వెళ్లే మార్గంలో వీధి దీపాలు లేకపోవడంతో ఆ ప్రాంతమంతా అంధకారం నెలకొంది. దీనికి తోడు రహదారి అధ్వాన్నంగా ఉండటంతో మహిళలు చీకట్లోనే భయం భయంగా నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. ఆచారంలో భాగంగా కొందరు మహిళలు కాళ్లకు చెప్పులు లేకుండా గతుకుల రోడ్డుపై నడుస్తూ తీవ్ర అవస్థలు పడ్డారు.
రాష్ట్ర పండుగైన బతుకమ్మ సందర్భంగా మహిళలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో పురపాలక అధికారులు పూర్తిగా విఫలమయ్యారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
