
వీణవంక, అక్టోబర్ 18 (జిందగీ 9 న్యూస్): వీణవంక మండలం గంగారం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన బతుకమ్మ విగ్రహాన్ని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వొడితల ప్రణవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, ఆడబిడ్డలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ రాష్ట్ర ప్రత్యేకతను చాటిచెబుతుందని అన్నారు. బతుకమ్మ పండుగ రోజున నూతనంగా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
