
జమ్మికుంట, అక్టోబర్ 17 (జిందగీ 9 న్యూస్): జమ్మికుంట పట్టణంలోని బస్టాండ్లో శనివారం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో కత్తులతో దాడి జరగడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసేందుకు జమ్మికుంట పోలీస్ స్టేషన్కు వెళ్లగా, అక్కడి సీఐ మెరుగైన వైద్యం కోసం వారిని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో జమ్మికుంట పట్టణంలో కలకలం రేగింది. అయితే ఘర్షణకు గల కారణాలు, గాయపడిన వారి పేర్లు, ఇతర పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసుల విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
