ఐపీఎల్ తరహాలో బీవీఎల్–1 బంజారా లీగ్ వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం

నిజామాబాద్ రూరల్(సిరికొండ), అక్టోబర్ 17 (జిందగీ 9 న్యూస్): నిజామాబాద్ రూరల్ సిరికొండ మండలంలోని గోప్య తండా, సర్పంచ్ తండా, గడ్డమీద తండా గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో ఐపీఎల్ తరహాలో నిర్వహిస్తున్న బీవీఎల్ (BVL) బంజారా లీగ్–1 వాలీబాల్ టోర్నమెంట్‌ను శనివారం ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ఇందల్వాయి రేంజ్ ఆఫీసర్ (FRO) రావి మోహన్ భట్, బహుజన టీచర్స్ ఫెడరేషన్ (BTF) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. సంతోష్ నాయక్, సెక్షన్ ఆఫీసర్ భాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
డ్రగ్స్‌కు దూరంగా.. క్రీడలకు దగ్గరగా
యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచి, క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడమే బంజారా లీగ్ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. “Say No to Drugs” నినాదంతో యువతలో ఆరోగ్యకరమైన జీవనశైలి, క్రమశిక్షణ, ఐక్యత, క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడల్లో రాణించి, సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
గ్రామీణ క్రీడాకారులకు ప్రతిభ చాటుకునే అవకాశం
ఐపీఎల్ తరహాలో నిర్వహిస్తున్న ఈ వాలీబాల్ లీగ్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులకు తమ ప్రతిభను చాటుకునే అవకాశం లభిస్తుందని నిర్వాహకులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహిస్తూ యువతకు మంచి భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. లీగ్ మ్యాచ్‌లను యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం (లైవ్ స్ట్రీమింగ్) చేస్తున్నట్లు తెలిపారు. దీంతో వివిధ ప్రాంతాల్లోని క్రీడాభిమానులు సైతం మ్యాచ్‌లను వీక్షించవచ్చని పేర్కొన్నారు.
పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరు
ఈ కార్యక్రమంలో గోప్య తండా సర్పంచ్ మంజుల సంతోష్, సర్పంచ్ తండా సర్పంచ్ శోభ జీవన్ నాయక్, గడ్డమీద తండా సర్పంచ్ కేతావత్ రామ్ సింగ్, మెట్టుమరి తండా సర్పంచ్ కె. తిరుపతి, సంత్ సేవాలాల్ అధ్యక్షుడు జి. రవి, మాజీ అధ్యక్షుడు రాములు, విడిసి చైర్మన్లు బన్నాజీ, మాజీ సర్పంచ్ సరియా, మాజీ సర్పంచ్ రాంచందర్, ఎస్టీ బీజేపీ మోర్చా ఉపాధ్యక్షుడు దేశ్యా నాయక్, ఉప సర్పంచులు రామ్ చందర్, రమేష్, తండా నాయకులు లింబ నాయక్, శివరాం, వినోద్, రాంచందర్, కిషన్, లాలూ, అంబర్ లాల్, మోహన్‌తో పాటు వివిధ తండాలకు చెందిన నాయకులు, క్రీడాభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
