
నిజామాబాద్ రూరల్(సిరికొండ), అక్టోబర్ 16 (జిందగీ 9 న్యూస్): సిరికొండ మండల కేంద్రంలోని 5వ వార్డులో గ్రామపంచాయతీ నిధులతో నూతనంగా నిర్మించనున్న మురికి కాలువ (డ్రైనేజీ) పనులకు శుక్రవారం గ్రామ సర్పంచ్ మల్లెల సాయిచరణ్ పాలకవర్గ సభ్యులతో కలిసి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మల్లెల సాయిచరణ్ మాట్లాడుతూ.. 5వ వార్డులోని పులి నర్సయ్య ఇంటి నుంచి ఈర సునీల్ ఇంటి వరకు సుమారు 40 సంవత్సరాల క్రితం రైతు కటకంతో నిర్మించిన మురికి కాలువ పూర్తిగా శిథిలావస్థకు చేరి కూలిపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. స్థానికులు ఈ సమస్యను తమ దృష్టికి తీసుకురాగానే వెంటనే స్పందించి, గ్రామపంచాయతీ నిధులు కేటాయించి నూతన డ్రైనేజీ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. డ్రైనేజీ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి కాలనీవాసులు ఎదుర్కొంటున్న మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నామని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. ఈ భూమిపూజ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గ్యామ శోభన్, పాలకవర్గ సభ్యులు, నాయకులు కనగందుల మురళి, అల్లిపురం రాజకిషన్, అల్లిపురం శంకర్, కానపురం సునీత, కొలిపాక అశ్విని, బాదావత్ తిరుపతి, ఎరుకల నర్సయ్య, ముత్తమ, కారోబర్ ప్రవీణ్, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
