
హుజురాబాద్: పట్టణంలోని విద్యానగర్లో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ దేవి శరణ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం రోజున చండీ హోమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ వి. నవీన్ చంద్ ఐపీఎస్ హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా హుజురాబాద్ పట్టణ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో ఉండాలని, పండుగలను ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వైష్ణవి మురళి మంచికట్ల, దామెర అనుషా – అనురాగ్, గురుస్వామి నటరాజ్ బుర్ర, ఎల్.వి. అర్జున్తో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
