శాలపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు

హుజూరాబాద్, అక్టోబర్ 16 (జిందగీ 9 న్యూస్): హుజూరాబాద్ మండలం శాలపల్లి గ్రామంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు, మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
