
నిజామాబాద్ రూరల్(సిరికొండ), అక్టోబర్ 14 (జిందగీ 9 న్యూస్): నిజామాబాద్ జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 11, 12 తేదీల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొర్లికొండ క్రీడా మైదానంలో నిర్వహించిన 11వ రాష్ట్రస్థాయి మినీ సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ (అండర్-13) బాలికల పోటీల్లో సత్యశోధక్ పాఠశాల విద్యార్థినులు ఏ. యుగేశ్వరి, ఎం. మేఘన అద్భుత ప్రతిభ కనబరిచారు. నిజామాబాద్ జిల్లా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించిన వీరిద్దరూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి బంగారు పతకాలు సాధించారు. పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న యుగేశ్వరి, మేఘన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చాటి జిల్లాకు, పాఠశాలకు గుర్తింపు తీసుకురావడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బంగారు పతకాలు సాధించిన విద్యార్థినులను సాఫ్ట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త కార్యదర్శి శోభన్‌బాబు, జక్రాన్‌పల్లి ఎంఈఓ శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. గంగమోహన్, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి గంగాధర్ తదితరులు అభినందించారు. విద్యార్థినులు రాష్ట్రస్థాయిలో బంగారు పతకాలు సాధించడం పట్ల సత్యశోధక్ పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్. నర్సయ్య హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థినులతో పాటు వారికి శిక్షణ ఇచ్చిన కోచ్‌లు అనికేత్, అనిల్‌లను ప్రత్యేకంగా అభినందించారు. క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగుతూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
