రైల్వే ఆస్తుల పరిరక్షణపై అవగాహన కార్యక్రమం
ప్రజాధనాన్ని కాపాడుకోవాలి.. రైల్వే వస్తువులను చోరీ చేయొద్దు

హైదరాబాద్: రైల్వే ఆస్తుల పరిరక్షణపై యునైటెడ్ ఓటర్స్ సోషల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైళ్లలో ప్రయాణించే సమయంలో ఏసీ కోచ్లలో అందించే బెడ్షీట్లు, దుప్పట్లు, తువ్వాళ్లు, పిల్లో కవర్లు వంటి వస్తువులను కొందరు ప్రయాణికులు ఇంటికి తీసుకెళ్తున్న ఘటనలపై అవగాహన కల్పించారు. ప్రజల పన్నుల సొమ్ముతో సమకూర్చిన రైల్వే ఆస్తులను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. జనవరి 2022 నుంచి మే 2026 మధ్య భారతీయ రైల్వే ఏసీ కోచ్ల నుంచి సుమారు రూ.104.51 కోట్ల విలువైన 1.27 కోట్లకు పైగా బెడ్రోల్ వస్తువులు చోరీకి గురైనట్లు తెలిపారు . రైల్వేలో ప్రయాణించేందుకు టికెట్ కొనుగోలు చేసినంత మాత్రాన అక్కడ అందించే వస్తువులను ఇంటికి తీసుకెళ్లే హక్కు ఉండదని, అలాంటి చర్యల వల్ల ప్రజాధనానికి నష్టం వాటిల్లుతుందని వివరించారు. రైల్వే ఆస్తులను సంరక్షించాలని, ప్రజా ఆస్తుల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కొంగంటి రాజ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి మీసాల విజయ్, చెరుకు పైడయ్య, వై. రమేష్, రామ్ నారాయణ, అన్వేష్, జి. విజయ్, బైరి రవీందర్, పార్లపల్లి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
