
జమ్మికుంట: సహారా ఇండియా కోఆపరేటివ్ సొసైటీలలో డిపాజిట్లు చేసి, మెచ్యూరిటీ గడువు ముగిసినా తమ సొమ్ము తిరిగి అందక ఇబ్బందులు పడుతున్న బాధితులకు న్యాయం చేయాలని సహారా బాధితులు, కార్యకర్తలు, బాధితుల సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది పేద, మధ్యతరగతి ప్రజలు, చిన్న ఉద్యోగులు, కూలీలు, డెయిరీ రైతులు తమ పిల్లల చదువులు, వివాహాలు, వైద్య ఖర్చులు, వృద్ధాప్య అవసరాల కోసం కష్టపడి సంపాదించిన డబ్బును సహారా సంస్థలో డిపాజిట్ చేశారని పేర్కొన్నారు. కాలపరిమితి ముగిసినప్పటికీ అనేకమంది డిపాజిటర్లకు సొమ్ము తిరిగి అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు అందక బాధిత కుటుంబాలు తీవ్ర ఆర్థిక, మానసిక ఒత్తిడికి గురవుతున్నాయని తెలిపారు.
సామాన్య, బహుజన, అణగారిన వర్గాలు, మధ్యతరగతి ప్రజల సమస్యలపై పోరాడే నాయకులు ఈ అంశంపై జోక్యం చేసుకుని బాధితులకు అండగా నిలవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం, సెబీ (SEBI), సంబంధిత సహకార సంఘాలు, అధికార సంస్థల పరిధిలో ఉన్న నిధులు, పెండింగ్ క్లెయిమ్లపై తక్షణ చర్యలు తీసుకునేలా జాతీయ స్థాయిలో పోరాడాలని విజ్ఞప్తి చేశారు. అర్హులైన డిపాజిటర్లకు వారి అసలు సొమ్ముతో పాటు చట్టబద్ధంగా వర్తించే వడ్డీ లేదా పరిహారం అందేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించి, చెల్లింపుల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. సహారా బాధితులకు న్యాయం జరిగే వరకు తమ సమస్యను ప్రభుత్వాలు, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
