బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. మూడు రోజుల సమ్మె.. బ్యాంకింగ్ సేవలపై SBI కీలక ప్రకటన

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) సెప్టెంబర్ 28 నుంచి 30వ తేదీ వరకు మూడు రోజుల బ్యాంకు సమ్మెకు పిలుపునిచ్చినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తెలిపింది. ఈ నేపథ్యంలో ఖాతాదారులు ముఖ్యమైన బ్యాంకింగ్ లావాదేవీలను సమ్మె తేదీలకు ముందే పూర్తి చేసుకోవాలని సూచించింది.సమ్మె సమయంలో అత్యవసర బ్యాంకింగ్ సేవలను అందించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని SBI పేర్కొంది. నగదు అవసరాల కోసం ATMలు, ADWMలు వినియోగించాలని, Customer Service Points (CSPs) ద్వారా సేవలు పొందాలని సూచించింది. అలాగే Internet Banking, YONO, Mobile Banking, UPI తదితర డిజిటల్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవాలని ఖాతాదారులకు సూచించింది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
