జమ్మికుంట మున్సిపల్ కౌన్సిల్లో మూడు అంశాలకు ఏకగ్రీవ ఆమోదం

జమ్మికుంట, సెప్టెంబర్ 19: జమ్మికుంట మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సర్వసభ్య సమావేశం శనివారం మున్సిపల్ చైర్పర్సన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి సూచనల మేరకు సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ అజెండా అంశాలను సభ్యుల ముందు ప్రవేశపెట్టారు. అనంతరం మూడు అంశాలపై చర్చించిన కౌన్సిల్ సభ్యులు వాటికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
రూ.25 లక్షలతో బతుకమ్మ వేడుకల ఏర్పాట్లు: సద్దుల బతుకమ్మ, చిన్న బతుకమ్మ, పెద్ద బతుకమ్మ వేడుకలను పురస్కరించుకుని పట్టణంలోని పలు ప్రాంతాల్లో అవసరమైన ఏర్పాట్లు చేపట్టేందుకు రూ.25 లక్షల పరిపాలనా, ఆర్థిక అనుమతికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది.
గాంధీ జయంతి ఏర్పాట్లకు రూ.10 వేలు: గాంధీ జయంతి సందర్భంగా రంగులు వేయడం, పూల అలంకరణ తదితర కార్యక్రమాల నిర్వహణ కోసం సుమారు రూ.10 వేల వ్యయానికి ఆమోదం తెలిపారు.
శానిటేషన్ సామగ్రి కొనుగోలుకు రూ.2.85 లక్షలు: మున్సిపల్ శానిటేషన్ విభాగం అవసరాల కోసం బ్లీచింగ్ పౌడర్, మలాథియన్ ఆయిల్, గడ్డి మందు తదితర సామగ్రి కొనుగోలుకు సుమారు రూ.2.85 లక్షల వ్యయానికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది.
ఈ మూడు అంశాలను కౌన్సిల్ సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు. సమావేశంలో వైస్ చైర్మన్ మహ్మద్ ముంతాజ్ అలీ (జావిద్), మున్సిపల్ కౌన్సిలర్లు, మేనేజర్ జి. రాజిరెడ్డి, ఏఈ వికాస్, టీపీఎస్ వి. రమేష్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఐ. రమేష్, ఆర్ఐ ఎ. భాస్కర్‌తో పాటు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
