పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు

భువనగిరి, సెప్టెంబర్ 18: మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడిని ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ పోక్సో కోర్టు దోషిగా నిర్ధారించి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తుర్కపల్లి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో నిందితుడు ధీరావత్ నవీన్ (25)కు కోర్టు 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.
ఫిర్యాదు అందిన వెంటనే తుర్కపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో సేకరించిన సాక్ష్యాధారాల ఆధారంగా చార్జ్‌షీట్‌ను న్యాయస్థానంలో దాఖలు చేశారు. కేసును విచారించిన ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ పోక్సో కోర్టు నిందితుడిని దోషిగా నిర్ధారించి శిక్ష ఖరారు చేసింది.
బాలలపై లైంగిక నేరాలను నిరోధించేందుకు పోక్సో చట్టం కఠినమైన చట్టపరమైన రక్షణ కల్పిస్తుందని పోలీసులు తెలిపారు. 18 సంవత్సరాల లోపు పిల్లలపై లైంగిక వేధింపులు, దాడులు లేదా ఇతర లైంగిక నేరాలకు పాల్పడటం చట్టరీత్యా తీవ్రమైన నేరమని పేర్కొన్నారు. బాలలపై లైంగిక వేధింపులు లేదా అనుమానాస్పద ఘటనలు తెలిసిన వెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌కు లేదా చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, అత్యవసర సేవల 112కు సమాచారం అందించాలని ఎస్పీ అక్షాన్ష్ యాదవ్, ఐపీఎస్ సూచించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
