మైనారిటీ వెల్ఫేర్ అధికారికి తురక కాశ సంక్షేమ సంఘం వినతిపత్రం

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 16(Zindagi9news): తురక కాశ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సయ్యద్ బాద్ షా ఆదేశాల మేరకు బుధవారం రోజున సంఘం ప్రతినిధులు జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారిని కలిసి తురక కాశ కార్మికుల చేతివృత్తికి సంబంధించిన సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
తురక కాశ కార్మికుల చేతివృత్తిని ప్రోత్సహించేందుకు అవసరమైన జనరేటర్ల సౌకర్యం కల్పించాలని వారు అధికారిని కోరారు. చేతివృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులకు అవసరమైన సహాయ సహకారాలు అందించి, వారి జీవనోపాధికి ప్రభుత్వం అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో పాటు, వారి వృత్తి అభివృద్ధికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సంఘం ప్రతినిధులు కోరారు.
ఈ కార్యక్రమంలో తురక కాశ సంక్షేమ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు షేక్ బికారి, బూర్గంపాడు మండల అధ్యక్షులు అజీమ్ తదితరులు పాల్గొన్నారు.
జిందగీ 9 న్యూస్ | గోలి శ్రీను, న్యూస్ రిపోర్టర్ | జూలూరుపాడు
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
