లంచం కేసులో కాసిపేట తహసీల్దార్‌కు రెండేళ్ల జైలు

కరీంనగర్/మంచిర్యాల, సెప్టెంబర్ 11: లంచం తీసుకున్న కేసులో మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం అప్పటి తహసీల్దార్ అలుగునూరి రోశయ్యకు రెండేళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. ఈ మేరకు కరీంనగర్‌లోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నామా సంతోష్‌కుమార్ సెప్టెంబర్ 10, 2026న తీర్పు వెలువరించారు.
ఏసీబీ వివరాల ప్రకారం.. 2013 జనవరి 9న కాసిపేట తహసీల్దార్‌గా పనిచేసిన రోశయ్య.. ఓ వ్యక్తి వ్యవసాయ భూమిని రెవెన్యూ రికార్డుల్లో మ్యుటేషన్ (జమాబందీ) చేయడంతో పాటు పట్టాదార్ పాస్‌బుక్ జారీ చేసేందుకు అనుకూలంగా వ్యవహరించాలంటే రూ.10 వేల లంచం డిమాండ్ చేశారు. ఆ మొత్తాన్ని స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.కేసు విచారణలో నిందితుడిపై అవినీతి నిరోధక చట్టం, 1988లోని సెక్షన్ 7, సెక్షన్ 13(2) రెడ్ విత్ 13(1)(d) కింద నేరం రుజువైనట్లు కోర్టు నిర్ధారించింది. దీంతో రెండేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించింది.జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మూడు నెలల సాధారణ కారాగార శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించింది.ఈ కేసును ఏసీబీ అధికారులు దర్యాప్తు చేసి, కరీంనగర్‌లోని ప్రత్యేక కోర్టులో విచారణకు తీసుకెళ్లారు. విచారణ అనంతరం రోశయ్యను కోర్టు దోషిగా నిర్ధారించి శిక్ష విధించింది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
