జనగామ జిల్లాలో క్వాక్ క్లినిక్‌పై TG SAFE దాడి.. రూ.2.10 లక్షల మందులు సీజ్

జనగామ, సెప్టెంబర్ 10: జనగామ జిల్లా ఎర్రగొల్లపహాడ్ గ్రామంలో అర్హత లేని వ్యక్తి నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ క్లినిక్‌పై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (TG SAFE–Drugs Wing) అధికారులు ఆకస్మిక దాడి నిర్వహించారు.
అధికారుల తనిఖీల్లో సుమారు 40 రకాల ఔషధాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వీటిలో యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్‌తో పాటు హ్యాబిట్ ఫార్మింగ్ ఔషధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. స్వాధీనం చేసుకున్న మందుల విలువ సుమారు రూ.2.10 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
అర్హత లేకుండా వైద్యం చేస్తూ ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించే వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రజలు వైద్య సేవల కోసం అర్హత కలిగిన వైద్యులను మాత్రమే సంప్రదించాలని సూచించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
