పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు భారీ ఊరట.. గరిష్ఠ వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు

హైదరాబాద్, సెప్టెంబర్ 10: తెలంగాణలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. కానిస్టేబుల్, సమాన స్థాయి పోస్టుల ప్రత్యక్ష నియామకాలకు సంబంధించిన గరిష్ఠ వయోపరిమితిని మరో మూడేళ్లు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు సాధారణ పరిపాలన (సర్వీసెస్-ఎ) శాఖ G.O.Ms.No.129ను సెప్టెంబర్ 9, 2026న విడుదల చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం పోలీస్, ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లోని కానిస్టేబుల్, సమాన స్థాయి పోస్టులకు ఈ వయోపరిమితి పెంపు వర్తిస్తుంది.
ఇప్పటికే ప్రభుత్వం ఆయా యూనిఫాం సర్వీసుల ప్రత్యక్ష నియామకాలకు ఏడేళ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చింది. తాజాగా మరో మూడేళ్లు పెంచడంతో గతంలో ఇచ్చిన సడలింపుతో కలిపి మొత్తం 10 ఏళ్ల వరకు అదనపు వయోపరిమితి ప్రయోజనం లభించనుంది.
అయితే పోలీస్ శాఖలో PC Drivers పోస్టులకు ఈ తాజా వయోపరిమితి పెంపు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించే ప్రత్యక్ష నియామకాలకు ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి.
కానిస్టేబుల్, సబ్ఇన్స్పెక్టర్ పోస్టులకు గతంలో ఉన్న గరిష్ఠ వయోపరిమితుల్లో వ్యత్యాసాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, అభ్యర్థులకు మరింత అవకాశం కల్పించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
