నర్సుపై అత్యాచారం, హత్య.. నిందితుడు అరెస్ట్
సీసీటీవీ, సాంకేతిక ఆధారాలతో పట్టుకున్న పహాడీషరీఫ్ పోలీసులు

తుక్కుగూడ, ఆగస్టు 31 (జిందగీ9న్యూస్): తుక్కుగూడలో 21 ఏళ్ల ప్రైవేట్ ఆస్పత్రి నర్సుపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో ఎం.డి. సనావుల్లా ఖాన్ (34)ను పహాడీషరీఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల ఆధారంగా నిందితుడిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
బిహార్‌కు చెందిన సనావుల్లా తుక్కుగూడలో బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఆస్పత్రి సమీపంలోని మెకానిక్ షాపులోనే నివాసం ఉంటున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. సుమారు నెల రోజులుగా నర్సు కదలికలను గమనించిన నిందితుడు.. ఆగస్టు 28–29 అర్ధరాత్రి కిటికీ ద్వారా ఆమె గదిలోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడిని నర్సు ప్రతిఘటించడంతో ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. పెనుగులాటలో నిందితుడి వేలిని మృతురాలు కొరికినట్లు, అతడి గొంతు, ఛాతిపై గోళ్లతో గాయాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
హత్య అనంతరం నిందితుడు మృతురాలిపై లైంగిక దాడికి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. నేరం అనంతరం కిటికీ మూసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు.
ఘటనపై దర్యాప్తు సమయంలో డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. జాగిలం ఆస్పత్రి సమీపంలోని మెకానిక్ షాపు వద్ద ఆగడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో సనావుల్లాను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.
నిందితుడి నుంచి Samsung మొబైల్ ఫోన్, దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసులో శాస్త్రీయ, సాంకేతిక ఆధారాల సేకరణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
