ఆటోను ఢీకొన్న కోళ్ల వ్యాన్.. మహిళ మృతి
క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

కరీంనగర్, ఆగస్టు 30: గంగాధర మండలం మధురానగర్లో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. మంగపేట గ్రామానికి చెందిన లింగాల దేవమ్మ ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు సమాచారం.
మంగపేటకు చెందిన వ్యవసాయ కూలీలు ఆటోలో ప్రయాణిస్తుండగా కోళ్ల వ్యాన్ ఢీకొన్నట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో దేవమ్మతో పాటు ఉప్పరమల్యాల గ్రామానికి చెందిన మరో వ్యక్తి గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రితో పాటు మెడికవర్ ఆస్పత్రికి తరలించారు.
ప్రమాద విషయం తెలుసుకున్న చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం ఆస్పత్రులకు వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
ఘటనకు సంబంధించి పోలీసులు వివరాలు సేకరిస్తూ ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
