విద్యార్థులే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య భవిష్యత్: సీఈసీ జ్ఞానేశ్ కుమార్

లక్నో: విద్యార్థులు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌కు భవిష్యత్ పౌరులని కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో సోమవారం Electoral Literacy Clubs (ELC 2.0) – ECINET”పై రెండో ప్రాంతీయ సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి జ్ఞానేశ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియపై యువతకు అవగాహన కల్పించడంలో ఎలక్టోరల్ లిటరసీ క్లబ్‌లు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఎన్నికల విధానం, ఓటరు నమోదు, పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఎన్నికల సంఘం విధులు తదితర అంశాలపై విద్యార్థులు, తొలిసారి ఓటు వేయబోయే యువతకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
“Learn Democracy. Lead Democracy.” అనే నినాదంతో ELC 2.0 కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో విస్తరించనున్నట్లు తెలిపారు. యువత ప్రజాస్వామ్య ప్రక్రియపై అవగాహనతో, బాధ్యతాయుతంగా పాల్గొనడం దేశ ప్రజాస్వామ్య భవిష్యత్తుకు పెట్టుబడి వంటిదని పేర్కొన్నారు.
ELC 2.0 ద్వారా విద్యాసంస్థల్లో ఏడాది పొడవునా ఎన్నికల అక్షరాస్యత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ECINET డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి ఓటరు జాబితా నుంచి పోలింగ్ వరకు ఎన్నికలకు సంబంధించిన వివిధ సేవలు, సమాచారాన్ని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
దేశవ్యాప్తంగా సుమారు 15 లక్షల పాఠశాలలు, దాదాపు 25 కోట్ల మంది విద్యార్థులు, కోటి మందికి పైగా ఉపాధ్యాయులు ఉన్న నేపథ్యంలో ఈ కార్యక్రమం ద్వారా యువతలో ఎన్నికల అవగాహనను మరింత విస్తృతం చేయాలని ఎన్నికల సంఘం లక్ష్యంగా పెట్టుకుంది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
