సెప్టెంబర్ 11న బ్యాంకుల దేశవ్యాప్త సమ్మె.. 4 రోజుల పాటు సేవలకు అంతరాయం!

న్యూఢిల్లీ: వారానికి ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న పలు డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) సెప్టెంబర్ 11న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది.
ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం అమలు, పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) అంశం, పెన్షన్‌కు సంబంధించిన డిమాండ్లు తదితర అంశాలపై యూనియన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఐదు రోజుల పని విధానానికి సంబంధించి 2024లో ఒప్పందం జరిగినప్పటికీ అమలు ఆలస్యం అవుతోందని యూనియన్లు పేర్కొంటున్నాయి.
సెప్టెంబర్ 11 శుక్రవారం కావడంతో ఆ తర్వాత రెండో శనివారం, ఆదివారాలు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. సెప్టెంబర్ 14న గణేశ్ చతుర్థి సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో సెలవు ఉండటంతో ఆయా ప్రాంతాల్లో వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.
డిమాండ్లు పరిష్కారం కాకపోతే సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల సమ్మెతో పాటు అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మె చేపట్టాలని కూడా బ్యాంకు యూనియన్లు హెచ్చరించాయి.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
