ఆన్లైన్ బెట్టింగ్ అప్పులతో యువకుడి బలవన్మరణం

జమ్మికుంట: ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్, క్రెడిట్ కార్డుల ద్వారా చేసిన అప్పులు తీర్చలేక మానసికంగా కుంగిపోయిన ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన జమ్మికుంట మండలం గండ్రపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన లింగంపల్లి ప్రదీప్‌రావు (30) బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం ఇంటి వద్ద ఉంటున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్‌తో పాటు వివిధ క్రెడిట్ కార్డుల ద్వారా అప్పులు చేసినట్లు సమాచారం. అప్పులు తీర్చలేక కొంతకాలంగా మానసికంగా ఆందోళనకు గురవుతున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రదీప్‌రావు బలవన్మరణానికి పాల్పడ్డాడు.ఈ ఘటనపై మృతుడి తండ్రి లింగంపల్లి సంపత్‌రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
