బ్రిడ్జిపై నుంచి పడిన వోల్వో బస్సు.. 40 మందికి గాయాలు!
హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ బస్సు ప్రమాదం.. 10 మంది పరిస్థితి విషమం

అనంతపురం, ఆగస్టు 9 (జిందగి9న్యూస్): హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఓ ప్రైవేట్ వోల్వో బస్సు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం సమీపంలో ఘోర ప్రమాదానికి గురైంది. ఈచర్ వాహనాన్ని ఢీకొన్న అనంతరం రెండు వాహనాలు బ్రిడ్జిపై నుంచి కింద పడిపోయినట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో సుమారు 40 మంది ప్రయాణికులు గాయపడినట్లు తెలుస్తోంది. వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న డ్రైవర్ను జేసీబీ సాయంతో బయటకు తీసినట్లు సమాచారం.
క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
