హైడ్రా ఉద్యోగాల కోసం భారీగా తరలివచ్చిన నిరుద్యోగులు
150 పోస్టులకు 5,000 మందికి పైగా అభ్యర్థులు.. రాత పరీక్ష లేకుండా ఫిజికల్ ఈవెంట్స్ ఆధారంగా ఎంపిక

హైదరాబాద్, ఆగస్టు 8 (Zindagi9news): హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA)లో ఉద్యోగాల కోసం నిరుద్యోగులు భారీగా తరలివచ్చారు. మొత్తం 150 పోస్టులకు 5,000 మందికి పైగా అభ్యర్థులు హాజరుకావడంతో ఎంపిక ప్రక్రియ వద్ద రద్దీ నెలకొంది. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు రావడంతో కొంతసేపు తొక్కిసలాట వాతావరణం కనిపించింది.
హైడ్రా పరిధిలో 100 డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అసిస్టెంట్ పోస్టులు, 50 హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ పోస్టులకు అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా కాకుండా ఫిజికల్ ఈవెంట్స్ ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఉద్యోగాల కోసం పెద్ద సంఖ్యలో అభ్యర్థులు రావడంతో ఎంపిక కేంద్రాల వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అభ్యర్థుల సంఖ్య భారీగా ఉండటంతో ప్రక్రియను క్రమబద్ధంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు.
