కరీంనగర్ జిల్లాలో 60 అంగన్వాడీ టీచర్ పోస్టులకు నోటిఫికేషన్
- గంగాధర, హుజూరాబాద్, కరీంనగర్ రూరల్, కరీంనగర్ అర్బన్ ప్రాజెక్టుల్లో ఖాళీలు
- ఆగస్టు 1 నుంచి దరఖాస్తుల స్వీకరణ.. ఆగస్టు 15 సాయంత్రం 5 గంటల వరకు గడువు

కరీంనగర్, ఆగస్టు 1 (Zindagi9News): మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాలో 60 అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
ప్రాజెక్టుల వారీగా ఖాళీలు:
- గంగాధర – 20 పోస్టులు
- హుజూరాబాద్ – 16 పోస్టులు
- కరీంనగర్ (రూరల్) – 16 పోస్టులు
- కరీంనగర్ (అర్బన్) – 8 పోస్టులు
అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు 2026 ఆగస్టు 1 నుంచి ఆగస్టు 15 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. కనీస విద్యార్హత 10వ తరగతి ఉత్తీర్ణతగా నిర్ణయించారు.
దరఖాస్తులు, పూర్తి నోటిఫికేషన్ మరియు ఇతర వివరాలు https://wdcw.tg.nic.in/ లో అందుబాటులో ఉన్నాయి. అర్హులైన మహిళలు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
