తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాల భర్తీకి నాలుగు నోటిఫికేషన్లు విడుదల
పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఫైర్, జైళ్ల శాఖల్లో భారీ నియామకాలు
సివిల్ కానిస్టేబుల్ పోస్టులే 3,697.. ఎస్ఐ పోస్టులు కూడా భర్తీ
ఆన్లైన్ దరఖాస్తుల తేదీలను త్వరలో ప్రకటించనున్న టీజీపీఆర్బీ

హైదరాబాద్, జూలై 29 (Zindagi9News): తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TGPRB) రాష్ట్రంలోని పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF), ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్, జైళ్లు & కరెక్షనల్ సర్వీసెస్ శాఖల్లో మొత్తం 7,437 పోస్టుల భర్తీకి నాలుగు నోటిఫికేషన్లు విడుదల చేసింది.
నోటిఫికేషన్ ప్రకారం పోలీస్ శాఖలో 148 సివిల్ ఎస్ఐలు, 14 ఏఆర్ రిజర్వ్ ఎస్ఐలు, 12 టీజీఎస్పీ రిజర్వ్ ఎస్ఐలు, 3 ఎస్ఏఆర్సీపీఎల్ రిజర్వ్ ఎస్ఐలు, 23 అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (FPB), 3,697 సివిల్ కానిస్టేబుళ్లు, 1,052 ఏఆర్ కానిస్టేబుళ్లు, 24 ఎస్ఏఆర్సీపీఎల్ కానిస్టేబుళ్లు, 20 పోలీస్ కానిస్టేబుల్ (డ్రైవర్), 7 పోలీస్ కానిస్టేబుల్ (మెకానిక్) పోస్టులు ఉన్నాయి.
అదేవిధంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో 44 సబ్ ఇన్స్పెక్టర్, 1,380 కానిస్టేబుల్, ఫైర్ శాఖలో 39 స్టేషన్ ఫైర్ ఆఫీసర్, 751 ఫైర్ ఫైటర్, జైళ్ల శాఖలో 14 డిప్యూటీ జైలర్ (పురుషులు), 1 డిప్యూటీ జైలర్ (మహిళ), 196 వార్డర్ (పురుషులు), 12 వార్డర్ (మహిళలు) పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ, ముగింపు తేదీలను త్వరలో ప్రత్యేక ప్రకటన ద్వారా వెల్లడిస్తామని టీజీపీఆర్బీ తెలిపింది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు నోటిఫికేషన్లో పేర్కొన్న అర్హతలు, శారీరక ప్రమాణాలు, వైద్య ప్రమాణాలను పరిశీలించాలని సూచించింది. అలాగే ఎస్సీ సబ్గ్రూప్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్, నాన్-క్రీమీ లేయర్, స్థానిక అభ్యర్థి ధ్రువీకరణ పత్రాలు తదితర అవసరమైన పత్రాలను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొంది.
అధికారిక వెబ్సైట్:
TGPRB అధికారిక వెబ్సైట్ (https://tgprb.in/)
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
