దోస్త్ స్పెషల్ ఫేజ్ షెడ్యూల్ విడుదల.. జూలై 20 నుంచి రిజిస్ట్రేషన్లు
సీటు రాని విద్యార్థులతో పాటు కొత్త అభ్యర్థులకు అవకాశం.. జూలై 30న సీట్ల కేటాయింపు

హైదరాబాద్, జూలై 18 (Zindagi9News): తెలంగాణ డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్ సర్వీసెస్ (DOST) 2026-27 విద్యా సంవత్సరానికి స్పెషల్ ఫేజ్ అడ్మిషన్ షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి (TGCHE) విడుదల చేసింది. ఇప్పటికే దోస్త్ లో నమోదు చేసుకుని సీటు రాని విద్యార్థులతో పాటు ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకోని అభ్యర్థులకు కూడా ఈ స్పెషల్ ఫేజ్‌లో అవకాశం కల్పించారు.
స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్ జూలై 20 నుంచి 26 వరకు రూ.400 రిజిస్ట్రేషన్ ఫీజుతో నిర్వహించనున్నారు. వెబ్ ఆప్షన్ల నమోదుకు జూలై 20 నుంచి 27 వరకు అవకాశం ఉంటుంది. ప్రత్యేక కేటగిరీ సర్టిఫికెట్ల ధ్రువీకరణ జూలై 27న యూనివర్సిటీ హెల్ప్‌లైన్ సెంటర్లలో నిర్వహించనున్నారు.
స్పెషల్ ఫేజ్ సీట్ల కేటాయింపును జూలై 30న ప్రకటిస్తారు. సీటు పొందిన విద్యార్థులు జూలై 30 నుంచి ఆగస్టు 1 వరకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. అనంతరం జూలై 31 నుంచి ఆగస్టు 1 వరకు సంబంధిత కళాశాలల్లో హాజరై అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.
అయితే ఇప్పటికే CCOTP ద్వారా సీటును ఖరారు చేసుకున్న విద్యార్థులు స్పెషల్ ఫేజ్‌కు అర్హులు కాదని అధికారులు స్పష్టం చేశారు. మెరుగైన సీటు పొందేందుకు విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
