40 మంది ప్రయాణికులను కాపాడిన డ్రైవర్‌కు రూ.10 వేల బహుమతి
అగ్నిప్రమాదానికి గురైన ఎలక్ట్రిక్ బస్సును పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్, జూన్ 21(Zindagi9news): కరీంనగర్-2 డిపోకు చెందిన ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సు ఆదివారం ఉదయం ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదానికి గురైన ఎలక్ట్రిక్ బస్సును రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఘటనకు సంబంధించి బస్సు డ్రైవర్‌తో పాటు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాద సమయంలో చాకచక్యంగా వ్యవహరించి బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చిన డ్రైవర్‌ను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా ఆయనను సత్కరించి రూ.10 వేల నగదు పారితోషికాన్ని అందజేశారు..

Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
