
విశాఖపట్నం, గాజువాక: గాజువాకలోని కణితి రోడ్ మార్కెట్ రోడ్డులో ఉన్న శివ క్రాకర్స్ దుకాణం వద్ద గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దుకాణం బయట వెల్డింగ్ పనులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.ఈ ఘటనలో వెల్డింగ్ పనులు చేస్తున్న వ్యక్తికి గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని వేగంగా స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
సకాలంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది స్పందించడంతో ప్రమాదం మరింత విస్తరించకుండా నివారించగలిగారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
