టీజీపీఎస్సీ నుంచి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (డీఈఓ)/గెజిటెడ్ హెడ్మాస్టర్ గ్రేడ్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 24 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు కమిషన్ శుక్రవారం ప్రకటించింది.
నోటిఫికేషన్ నంబర్ 03/G/SE/2026 ప్రకారం, అభ్యర్థుల వయోపరిమితి 2026 జూలై 1 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ జూన్ 12, 2026 నుంచి ప్రారంభమై జూలై 19, 2026 వరకు కొనసాగుతుంది. అర్హతలు, పరీక్ష విధానం, రిజర్వేషన్లు తదితర పూర్తి వివరాల కోసం అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ www.tgpsc.gov.in ను సందర్శించాలని కమిషన్ సూచించింది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
