రేపు ఫార్మసీ దుకాణాల బంద్: ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్

హైదరాబాద్, మే 19 (జిందగీ9న్యూస్): దేశవ్యాప్తంగా రేపు నిర్వహించనున్న ఫార్మసీ దుకాణాల బంద్ నేపథ్యంలో రోగులు ఇబ్బందులు పడకుండా తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) ప్రత్యేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో మందుల కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
బంద్ సమయంలో ఆసుపత్రులకు అనుబంధంగా ఉన్న ఫార్మసీలు, కార్పొరేట్ మందుల దుకాణాలు సాధారణంగా పనిచేస్తాయని పేర్కొన్నారు. దీంతో అత్యవసర వైద్య సేవలు పొందుతున్న రోగులకు మందుల సరఫరాలో అంతరాయం ఉండదని స్పష్టం చేశారు.
అత్యవసర ఔషధాలు అందుబాటులో లేకపోతే ప్రజలు స్థానిక డ్రగ్ ఇన్స్పెక్టర్లను సంప్రదించవచ్చని, అలాగే టోల్ ఫ్రీ నంబర్ 1800 599 6969కు కాల్ చేసి సహాయం పొందవచ్చని అధికారులు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర మందుల లభ్యతపై నిరంతర పర్యవేక్షణ కోసం డ్రగ్స్ కంట్రోల్ విభాగం ఫీల్డ్ అధికారులను అప్రమత్తం చేసినట్లు వెల్లడించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరమైన మందుల సరఫరా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
