
విద్యుత్ ఆర్టిసన్ ఉద్యోగుల సమస్యలపై త్వరలో చర్చలు: భట్టి విక్రమార్క
హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు సమ్మె అనంతర పరిణామాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు. ఉద్యోగుల సమస్యలు, పెండింగ్ డిమాండ్లపై ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ట్రాన్స్కో, జెన్కో, డిస్కంల సీఎండీలతో త్వరలో ప్రత్యేకంగా చర్చలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని తెలిపారు.
సమ్మె అనంతరం ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జేఏసీ నాయకులకు భరోసా ఇచ్చినట్లు సమాచారం.
