ఏప్రిల్ 17న పెద్దపల్లిలో భారీ జాబ్ మేళా – నిరుద్యోగులకు సువర్ణావకాశం

పెద్దపల్లి, ఏప్రిల్ 15(zindagi9news):
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఈ నెల 17న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో భారీ ఉద్యోగ మేళాను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.
టాస్క్ (TASK) రీజినల్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ జాబ్ డ్రైవ్‌లో ప్రముఖ కంపెనీలు పాల్గొని అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయి. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి పెద్దపల్లి బస్టాండ్ సమీపంలోని టాస్క్ రీజినల్ సెంటర్లో ఈ ఇంటర్వ్యూలు నిర్వహించబడతాయి.
ఈ మేళాలో AJ Solution, Varkas EV Motors, Mega Engineering & Infrastructures Limited వంటి ప్రతిష్టాత్మక సంస్థలు పాల్గొని అభ్యర్థులతో నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
డిప్లొమా, ఐటీఐ, ఎంబీఏ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అవకాశానికి అర్హులు. ఆసక్తి గల వారు రెండు సెట్ల తాజా రెజ్యూమ్‌తో పాటు ఫార్మల్ డ్రస్‌లో ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు.
అభ్యర్థులు నిర్ణీత సమయం కంటే ముందుగానే వేదికకు చేరుకోవాలని, జిల్లాలోని యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి కంపెనీల్లో ఉద్యోగాలు పొందాలని కలెక్టర్ సూచించారు. మరిన్ని వివరాల కోసం పెద్దపల్లి టాస్క్ రీజినల్ సెంటర్‌ను సంప్రదించాలని తెలిపారు.
